Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌లో మరొక టెర్రరిస్ట్ ఖతం.. ఈ సారి మాత్రం చంపే స్టైల్ మారింది..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.

Read Also: Israel-Hamas War: హమాస్ టెన్నెల్స్‌లో ఐదుగురు బందీల మృతదేహాలు.. గాజా దాడిలో 78 మంది మృతి

ఇదిలా ఉంటే తాజాగా ఓ జీహాదీ గురవును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. లష్కరేతోయిబా ఉగ్ర సంస్థకు చెందిన అబ్దుల్లా షాహీన్ అనే ఉగ్రవాదిని కసూర్‌లో వాహనంతో ఢీకొట్టించి చంపారు. అయితే ఈసారి మాత్రం గుర్తు తెలియని వ్యక్తుల హత్యా విధానం మారింది. గతంలో కాకుండా, వాహనంతో ఢీకొట్టి చంపారు. ఇదిలా ఉంటే యథావిధిగా నిందితులు ఎవరో అక్కడి అధికారులకు అంతుబట్టడం లేదు. ఇది కేవలం ప్రమాదామా..? ఉద్దేశపూర్వక చర్చనా..? అని విచారిస్తున్నారు. అబ్దుల్లా షాహీన్ భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు.

పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 15 మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇది ఎవరి చర్య అనేది అంతుబట్టడం లేదు. అయితే కొంతమంది ప్రకారం.. ఇది పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పనే అని చెబుతుంటే.. మరికొందరు ఈ హత్యల్లో భారత్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.

Exit mobile version