Site icon NTV Telugu

US-Venezuelan: ట్రంప్ హెచ్చరికలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు

Us

Us

అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దిగిపోవాలని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్ హెచ్చరికలను నికోలస్ ఖాతర్ చేయలేదు. తాజాగా అమెరికా రంగంలోకి దిగింది.

శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్‌లో అమెరికా దాడులు చేసింది. దాదాపు 7 చోట్ల పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించిన పొగ వెదజల్లింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల శబ్దాలు వినిపించాయి. ఇక ప్రజలు వీధుల్లో పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

వెనిజులా నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఇప్పటికే అమెరికా పలు దాడులు చేసింది. సముద్రంలో పలు నౌకలను పేల్చేసింది. పదుల కొద్ది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. తాజాగా వెనిజులా రాజధానిలో భారీ పేలుడు సంభవించాయి. అయితే ఈ దాడులను అమెరికానే చేసినట్లుగా వెనిజులా భావిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంధకారం అలుముకుంది.

ఇది కూడా చదవండి: Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!

 

 

Exit mobile version