Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా మొదలవుతుంది. దోమల నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది స్ప్రేలు, క్రీములు, రిపెలెంట్లను ఉపయోగిస్తుంటారు. అయితే దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగించే కొన్ని రసాయనాలు కాలక్రమేణా వాటినే మనవైపు ఆకర్షించే అవకాశముందని తాజా పరిశోధన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దోమలు కేవలం ఇబ్బంది కలిగించే కీటకాలు మాత్రమే కావు. అవి డెంగ్యూ, మలేరియా, జికా వైరస్, చికున్‌గున్యా, జ్వరం వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 7 లక్షల మంది మరణిస్తున్నారు.
తాజాగా జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, దోమలు అనుభవాల ఆధారంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా DEET (N,N-Diethyl-meta-toluamide) అనే రసాయనం కలిగిన దోమల నివారణ స్ప్రేలపై దోమల ప్రవర్తన కాలక్రమేణా మారే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్శిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ క్లెమెంట్ వినౌగర్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. పరిశోధనలో ప్రధానంగా డెంగ్యూ, జికా, జ్వరం వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి (Aedes aegypti) జాతి దోమలను పరిశీలించారు.
Also Read
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు దోమలకు పావ్లోవియన్ కండిషనింగ్ పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. ఆకలితో ఉన్న దోమలకు వెచ్చని మానవ రక్తం ఉన్న సంచిని చూపిస్తూ, అదే సమయంలో DEET వాసనను విడుదల చేశారు. ఇలా పలు మార్లు చేసిన తర్వాత, దోమలు ఆ వాసనను ఆహారంతో అనుసంధానం చేసుకున్నట్లు గుర్తించారు. నాలుగు సార్లు ప్రయోగం పునరావృతం చేసిన అనంతరం, 60 శాతానికి పైగా దోమలు DEET వాసన ఉన్నప్పటికీ రక్తాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాయి. అనంతరం రెండు చేతులపై పరీక్ష నిర్వహించగా, శిక్షణ పొందని దోమలు DEET పూసిన చేతికి దూరంగా ఉండగా, శిక్షణ పొందిన దోమలు అదే చేతి వైపు ఆకర్షితమయ్యాయి.
దీంతో దోమల మెదడు అనుభవాల ఆధారంగా తమ ప్రవర్తనను మార్చుకోగలదని పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు DEET వాసన దోమలకు అసహ్యంగా అనిపిస్తుందని లేదా మన వాసనను దాచిపెడుతుందని భావించేవారు. అయితే దోమలు ఆ వాసనను ఆహార సంకేతంగా గుర్తుంచుకునే అవకాశం కూడా ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే ఈ పరిశోధన ఫలితాలను చూసి ప్రజలు DEET ఆధారిత స్ప్రేలను పూర్తిగా వాడటం మానేయాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన దోమల నివారణ రసాయనాల్లో DEET ఒకటేనని పేర్కొన్నారు.
అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో స్ప్రే ఉపయోగించడానికి బదులుగా, అవసరానికి అనుగుణంగా క్రమం తప్పకుండా మళ్లీ పూయడం ద్వారా మెరుగైన రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. దోమల ద్వారా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్లో నివసించే వారు రిపెలెంట్ల వినియోగాన్ని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ అధ్యయనం దోమల ప్రవర్తనపై కొత్త ప్రశ్నలను లేవనెత్తడంతో పాటు, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన దోమల నియంత్రణ పద్ధతుల అభివృద్ధికి మార్గం సుగమం చేయనుంది.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..