Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంత నగరంపై బాంబుల వర్షం.. బాలిక సహా ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moscow Attacks Zelensky Hometown After He Said War Had Returned To Russia: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రివ్యి రిహ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ఎదురుదాడులను నిర్వీర్యం చేసే క్రమంలోనే.. రష్యా సోమవారం ఈ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో పదేళ్ల బాలికతో పాటు మొత్తం ఆరుగురు మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు యూనివర్సిటీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని రెస్క్యూ ఆపరేషన్‌తో బయటకు తీస్తున్నారు. రష్యా చేసిన ఈ దాడులపై ఉక్రెయిన్ అంతరంగిక మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సాంప్రదాయం ఉన్నప్పటికీ.. రష్యా దాన్ని ఉల్లంఘించిందని, అపార్ట్‌మెంట్లపై విరుచుకుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. రష్యా వాదన మాత్రం మరోలా ఉంది. తాము కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు రష్యా తెలిపింది.
Kyota Hattori Joker: రియల్ ‘జోకర్’ పాపం పండింది.. 23 ఏళ్ల జైలు శిక్ష
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
కాగా.. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాల్ని తిరిగి పొందేందుకు ఉక్రెయిన్ ఇటీవల తన దాడుల్ని ఉధృతం చేసింది. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలతో రష్యాపై విరుచుకుపడుతోంది. ఆదివారం మాస్కోపై డ్రోన్ దాడులకి తెగపడింది. ఈ దాడి చేసిన మరుసటి రోజు.. జెలెన్‌స్కీ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. రష్యాకు యుద్ధం తిరిగి వస్తోందని హెచ్చరించారు. ఈ యుద్ధం క్రమేపీ రష్యా భూభాగంలోకి వెళ్తోందని.. ఇది తప్పనిసరైన, సహజమైన, సముచితమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. మరోవైపు.. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సైతం జెలెన్‌స్కీ వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ సైన్యంలోని అశక్తత రోజురోజుకూ బయటపడుతోందని, నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేక పోతోందని చెప్పారు. ఓవైపు ఈ యుద్ధం ఆపేందుకు ఇతర దేశాలు ప్రయత్నిస్తుంటే.. ఉక్రెయిన్, రష్యా మాత్రం పరస్పర దాడులతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!