Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న మెలోడీ వీడియో
- గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- అంతర్జాతీయ లెవెల్లో హైలెట్‌గా మోడీ-మెలోని కెమిస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో చివరి ఇటలీ టూర్ హైలెట్‌గా నిలిచింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని-ప్రధాని మోడీ మధ్య ఉన్న స్నేహం ఇంటర్నెట్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇద్దరి మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధాని మోడీ.. మెలోనీకి ‘మెలోడీ’ టాఫీలు బహుమతిగా ఇచ్చిన వీడియో కొన్ని గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. రోమ్‌లో ఇటలీ ప్రధాని మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలపై చర్చలు జరిపారు. అధికారిక సమావేశాల మధ్యలో చోటుచేసుకున్న ఓ చిన్న సరదా సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రధాని మోడీ చిరునవ్వుతో మెలోనీకి ‘మెలోడీ’ టాఫీల ప్యాక్‌ను అందజేస్తూ కనిపించారు. మెలోనీ కూడా నవ్వుతూ ఆ గిఫ్ట్‌ను స్వీకరించారు. ఈ వీడియోలో ఇద్దరు నాయకుల మధ్య కనిపించిన స్నేహపూర్వక అనుబంధం నెటిజన్లను ఆకట్టుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే 10 కోట్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ వీడియో సరికొత్త రికార్డుగా దిశగా వెళ్తోంది.
ప్రస్తుతం మోడీ-మెలోనిల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ అంతర్జాతీయ లెవెల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం రాత్రి ప్రధాని మోడీ రోమ్ నగరంలో ల్యాండ్ అయిన వెంటనే.. జార్జియా మెలోని ఆయనకు గ్రాండ్ డిన్నర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రోమ్ నగరానికి గర్వకారణమైన ఐకానిక్ కొలోసియం మానిమెంట్ దగ్గర కాసేపు సరదాగా నడుస్తూ డిస్కషన్స్ జరిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో దిగిన ఒక బ్యూటిఫుల్ సెల్ఫీని మెలోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “వెల్కమ్ టు రోమ్, మై ఫ్రెండ్!” అని క్యాప్షన్ పెట్టారు. అంతే.. ఆ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా 3.2 మిలియన్ అంటే 32 లక్షలకు పైగా వ్యూస్, లక్షన్నర కంటే ఎక్కువ లైక్స్‌తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.
ఈ టూర్లో వీరిద్దరి మధ్య సరికొత్త ‘కార్ డిప్లొమసీ’ కూడా కనిపించింది. ప్రధాని మోడీ, మెలోని ఇద్దరూ ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ఉన్న ఫొటోను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “రోమ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ప్రధాని మెలోనితో కలిసి డిన్నర్ చేశాను.. ఆపై ఐకానిక్ కొలోసియం విజిట్ చేసే ఛాన్స్ దక్కింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలపై మేమిద్దరం డిస్కస్ చేశాం. ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్ను నెక్స్ట్ లెవెల్‌కు ఎలా తీసుకెళ్లాలనే దానిపై బుధవారం జరగబోయే అఫీషియల్ బైలాటరల్ టాక్స్ కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను” అంటూ మోడీ పోస్ట్ పెట్టారు.
నిజానికి మోడీ- మెలోనిల ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2024 జూన్‌లో ఇటలీలో జరిగిన జీ7 (G7) సమ్మిట్ సమయంలో కూడా మెలోని ఒక సెల్ఫీ వీడియో పెడుతూ.. “హలో ఫ్రెండ్స్, ఫ్రమ్ #Melodi టీమ్” అంటూ వేవ్ చేశారు. దానికి మోడీ కూడా స్పందిస్తూ.. “లాంగ్ లివ్ ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్” అని రిప్లై ఇచ్చారు. అంతకుముందు 2023లో దుబాయ్‌లో జరిగిన కాప్28 (COP28) సమ్మిట్‌లో కూడా వీరిద్దరి సెల్ఫీ గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. 2023లో ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ కోసం ఇండియా వచ్చినప్పుడు మెలోనికి మోడీ గుజరాత్‌కు చెందిన సాంప్రదాయ ‘పటాన్ పటోలా’ స్కార్ఫ్‌ను ప్రెసెంట్ చేశారు. ఇక మోడీ మూడోసారి పీఎంగా గెలిచినప్పుడు యూరప్ నుంచి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పిన లీడర్ కూడా మెలోనినే కావడం విశేషం.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు