ప్రధాని మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. అక్కడ ఘనస్వాగతం లభించింది. ఇక పెద్ద ఎత్తున భారతీయులు ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా రామాయణం, మహాభారతాలను అరబిక్ భాషలో ప్రచురించిన అబ్దుల్లాలతీఫ్ అల్నెసెఫ్, అరబిక్‌లోకి అనువదించిన అబ్దుల్లా బారన్‌లను మోడీ కలిశారు. పుస్తకాలపై ప్రధాని సంతకాలు చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: మీడియా ముందుకొచ్చిన అల్లు అర్జున్
రామాయణ, మహాభారతాలను అరబిక్‌లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అబ్దుల్లా బారన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ, మహాభారత పుస్తకాలను ప్రధాని మోడీ చూసి సంతోషించారని, రెండు పుస్తకాలపై సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లాలతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. వీరిద్దరు ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్‌లో ప్రచురించారు.
ఇది కూడా చదవండి: YouTube: “తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెట్టారో అంతే సంగతి”.. యూట్యూబ్ కొత్త పాలసీ వివరాలు..
43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్‌కీబాత్‌లో కూడా అరబిక్‌లో రామాయణ, మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం విశేషం. ఇక పర్యటనలో భాగంగా కువైట్‌లో ఉంటున్న రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను మోడీని కలిశారు.
#WATCH | Prime Minister Narendra Modi met Abdullateef Alnesef, who published Ramayana and Mahabharata in Arabic language and Abdullah Baron, who translated them into Arabic, in Kuwait City
PM Modi also met 101-year-old Ex-IFS officer Mangal Sain Handa.
(Source: DD News) pic.twitter.com/hyvbFKP5g1
— ANI (@ANI) December 21, 2024