NTV Telugu Site icon

US: అమెరికాలో తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు

Us

Us

అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు చికాగో మిడ్‌‌వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి వచ్చేశాయి. దీంతో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్ అప్రమత్తమై.. చివరి నిమిషంలో ల్యాండ్ అవుతున్న విమానాన్ని వెంటనే పైకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద ప్రమాదమే సంభవించేది. అయితే అనుమతి లేకుండా ప్రైవేట్ జెట్ రన్‌వే‌లోకి వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ఇది కూడా చదవండి: Trump: ధనిక వలసదారులకు ట్రంప్ బిగ్ ఆఫర్.. పౌరసత్వం కావాలంటే..!

సుమారు ఉదయం 8:50 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలిపింది. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుందని అమెరికా మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Godavari River: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

ఇదిలా ఉంటే ప్రైవేటు జెట్ పైలట్‌ను దాదాపు తొమ్మిది సార్లు అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. రన్‌వేకి దూరంగా ఉండాలని సూచించారు. కానీ మిడ్‌వే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారాన్ని పైలట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే రన్‌వేపైకి వచ్చేశాడు. ఇక సౌత్‌వెస్ట్ విమానం నెబ్రాస్కాలోని ఒమాహా నుంచి వస్తోంది. ఇక బాంబార్డియర్ ఛాలెంజర్ 350 అనే ప్రైవేట్ జెట్ టేనస్సీలోని నాక్స్‌విల్లేకు వెళ్తోంది. మొత్తానికి ఘోర ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

గత నెలలో ఆర్మీ హెలికాప్టర్-ప్యాసింజర్ జెట్ ఢీకొని 67 మంది చనిపోయారు. అంతేకాకుండా ఇటీవల వారాల వ్యవధిలో పలు విమాన ప్రమాదాలు తప్పాయి. తాజాగా మరో పెద్ద ప్రమాదం తప్పింది.