Israel-Iran War: అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక వైపు ఇరాన్ ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై ప్రతీకారం దాడులు చేస్తున్నప్పటికీ సొంత దేశంలో మాత్రం విషాదకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆ దేశ సుప్రీంలీడర్ ఖమేనీ మరణించడంతో పాటు కీలకమైన ఉన్నతాధికారుల్ని ఇజ్రాయిల్ హతం చేసింది. అత్యంత విషాదకరమైన సంఘటన ఏదైనా ఉందంటే.. ఇరాన్‌లోని మినాబ్ లోని ఒక పాఠశాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడి. ఈ దాడిలో 160 మంది స్కూల్ బాలికలు మరణించారు.
Read Also: Rajyasabha Elections: రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్..
మంగళవారం ఈ దాడిలో మరణించిన 160 మంది బాలిక అంత్యక్రియలు ఒకే చోట జరిగియా. బాలిక శవపేటికల్ని పక్కపక్కన ఉంచి, ప్రార్థనలతో అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనతో ఇరాన్ మొత్తం శోఖసంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియల కోసం వేలాది మంది తరలివచ్చారు. వేలాది మంది అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నారు.
మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఫిబ్రవరి 28న ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ హర్మోజ్‌గాన్‌లోని మినాబ్‌లో ఒక పాఠశాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ ఘటనలోనే 165 మంది బాలికలు మరణించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన దాడిలో భవనంలో ఎక్కువ భాగం దెబ్బతింది. శిథిలాలను తొలగించడానికి రెస్క్యూ టీమ్స్ గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులే ఉన్నారు. అంత్యక్రియల రోజు మినాబ్ నగరంలోని మార్కెట్లను మూసేశారు. ఈ దాడి మినాబ్‌ను మాత్రమే కాకుండా ఇరాన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
