Donald Trump: ఎన్నికల ముందు ట్రంప్‌కి గుడ్‌న్యూస్.. ఫేస్బుక్, ఇన్‌స్టాపై ఆంక్షలు ఎత్తేసిన మెటా..
- ఎన్నికల ముందు ట్రంప్‌కి మెటా గుడ్ న్యూస్..
- ఫేస్బుక్
- ఇన్‌స్టా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేత..
- 2021 క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్‌పై బ్యాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది. 2021 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తర్వాత మెటా ట్రంప్ అకౌంట్లపై నిషేధాన్ని విధించింది. తాజాగా నాలుగేళ్ల తర్వాత నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తెలిపింది.
Read Also: Delhi: సునీతా కేజ్రీవాల్‌ను కలిసిన జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతులు
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
‘‘రాజకీయ వ్యక్తీకరణను అనుమతించడం మా బాధ్యత. అందుకే ఎన్నికల వేళ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆలోచనలు, మాటలని అమెరికన్ ప్రజలు వినాలని కోరుకుంటున్నాం. అందరు వినియోగదారుల మాదిరిగానే అభ్యర్థులు కూడా నిబంధనలకు లోబడి సోషల్ మీడియాని వినియోగించుకోవాలి. హింసను ప్రేరేపించేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదు’’ అని మెటా పేర్కొంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నామినీగా, ఇకపై సస్పెన్షన్ ఉండు అని తెలిపింది.
జనవరి 6, 2021లో యూఎస్ క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన రోజు తర్వాత ట్రంప్ తన ఫేస్బుక్, ఇన్‌స్టాల అకౌంట్లు బ్లాక్ చేయబడ్డాయి. సోషల్ మీడియాలో హింసకు పాల్పడిన వ్యక్తులను ప్రశంసించారని మెటా నిర్ధారించింది. దీంతో ప్రజలకు చేరువ కావలనే ఉద్దేశ్యంతో ట్రంప్ సొంతగా ‘ట్రూత్ సోషల్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ని ప్రారంభించారు. ట్రంప్‌కి ఫేస్బుక్లో 34 మిలియన్ల యూజర్లు, ఇన్‌స్టాలో 2.6 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!