NTV Telugu Site icon

Donald Trump: ఎన్నికల ముందు ట్రంప్‌కి గుడ్‌న్యూస్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాపై ఆంక్షలు ఎత్తేసిన మెటా..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది. 2021 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తర్వాత మెటా ట్రంప్ అకౌంట్లపై నిషేధాన్ని విధించింది. తాజాగా నాలుగేళ్ల తర్వాత నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తెలిపింది.

Read Also: Delhi: సునీతా కేజ్రీవాల్‌ను కలిసిన జార్ఖండ్ సీఎం హేమంత్ దంపతులు

‘‘రాజకీయ వ్యక్తీకరణను అనుమతించడం మా బాధ్యత. అందుకే ఎన్నికల వేళ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆలోచనలు, మాటలని అమెరికన్ ప్రజలు వినాలని కోరుకుంటున్నాం. అందరు వినియోగదారుల మాదిరిగానే అభ్యర్థులు కూడా నిబంధనలకు లోబడి సోషల్ మీడియాని వినియోగించుకోవాలి. హింసను ప్రేరేపించేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదు’’ అని మెటా పేర్కొంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నామినీగా, ఇకపై సస్పెన్షన్ ఉండు అని తెలిపింది.

జనవరి 6, 2021లో యూఎస్ క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన రోజు తర్వాత ట్రంప్ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాల అకౌంట్లు బ్లాక్ చేయబడ్డాయి. సోషల్ మీడియాలో హింసకు పాల్పడిన వ్యక్తులను ప్రశంసించారని మెటా నిర్ధారించింది. దీంతో ప్రజలకు చేరువ కావలనే ఉద్దేశ్యంతో ట్రంప్ సొంతగా ‘ట్రూత్ సోషల్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ని ప్రారంభించారు. ట్రంప్‌కి ఫేస్‌బుక్‌లో 34 మిలియన్ల యూజర్లు, ఇన్‌స్టాలో 2.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.