NTV Telugu Site icon

Meta Layoffs: ఉద్యోగులకు మెటా మరో ఝలక్.. మరిన్ని తొలగింపులకు సిద్ధం

Meta Layoffs

Meta Layoffs

Meta Prepares More Layoffs Across Facebook WhatsApp Instagram: మెటా సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. సరికొత్త టీమ్‌లను పునర్నర్మిస్తున్నారు. బుధవారం ఉద్యోగాల కోతలను ప్రకటించడానికి సిద్ధం కావాలని ఈ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మేనేజర్లకు తెలియజేసింది. మార్చిలో మార్క్ జూకర్‌బర్గ్ ప్రకటించినట్టు.. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగానే మెటా సంస్థ కోతలకు సిద్ధమైంది. మొత్తం 10 వేల మంది తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కొందరిని తొలగించి, రెండో రౌండ్‌లో భాగంగా మే నెలలో మరికొందరిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Kaylin Gillis Shot Dead: తప్పుడు డ్రైవ్‌వేలో వెళ్లిన పాపానికి.. కాల్చి చంపేశాడు

మెటా సంస్థ ఇప్పటికే నవంబర్ నెలలో 11 వేల మంది ఉద్యోగుల్ని (కంపెనీ వ్యాప్తంగా 13% మంది) తొలగించిన విషయం తెలిసిందే! ఆ సమయంలోనే జూకర్‌బర్గ్.. టెక్నాలజిస్ట్, ఇంజినీర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ని రీబ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నామని తెలిపాడు. అటు.. బృందాలు పునర్వ్యవస్థీకరించబడతాయని, కొత్త మేనేజర్‌ల క్రింద పని చేయడానికి కొందరు ఉద్యోగులను తిరిగి రీ-అసైన్డ్ చేయడం జరుగుతుందని మేనేజర్‌లకు ఒక మెమో పంపిణీ చేయబడిందని తెలిసింది. సమయానుకూలంగా పని చేసేందుకు గాను.. ఎవరెవరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారన్న విషయాన్ని సైతం నార్త్ అమెరికా ఉద్యోగులను మెటా అడగనున్నట్టు ఆ మెమోలో పేర్కొనబడింది. ఓ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. టెక్ గ్రూపులోని కొందరిని ఏప్రిల్ నెలలోనూ, అనంతరం బిజినెస్ గ్రూప్‌లోని మరికొంతమందిని మే నెలలోనూ తొలగించబోతున్నట్టు ప్రకటిస్తామని తెలిపాడు.

Spicejet Warning Light: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఊహించని ట్విస్ట్.. వార్నింగ్ లైట్ ఎంత పని చేసింది

Show comments