Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్‌పై మెలోని తీవ్ర ఆగ్రహం
- మిత్ర దేశాల మధ్య విభేదాలు
- కాకరేపుతోన్న ట్రంప్ వ్యాఖ్యలు
- అదంతా కల్పిత కథ అన్న మెలోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో జరిగిన జీ 7 వేదికగా ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలకు మెలోని ఘాటుగానే స్పందించారు. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోని వేడుకుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఆ కథ మొత్తం కల్పితమని.. అలాంటి ఘటనే అసలు జరగలేదని స్పష్టం చేశారు. అదంతా పూర్తి కల్పిత కథ అని కొట్టిపారేశారు. ఎక్స్ వేదికగా సీరియస్‌గా సమాధానం ఇచ్చారు.
ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మెలోనీ-ట్రంప్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అనంతరం ఓ ఇటాలియన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మెలోనీ నాతో ఫొటో దిగేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. ఆమె నన్ను ఫొటో కోసం వేడుకుంది. నాకు అవసరం లేకపోయినా జాలిపడి ఫొటో దిగాను” అని వ్యాఖ్యానించినట్లు ప్రసారమైంది.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు

అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెలోనీ తీవ్రంగా స్పందించారు.. “అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. వాటిని విని నేను ఆశ్చర్యపోయాను. తన మిత్రదేశాల నాయకుల పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల ప్రత్యర్థుల పట్ల ట్రంప్ మరింత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “పశ్చిమ దేశాల శత్రువుల విషయంలో ఆయన చూపించే సహనాన్ని, గౌరవాన్ని తన మిత్రదేశాల నాయకుల పట్ల చూపడం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. నేను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోము” అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ వివాదం నేపథ్యంలో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. “ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటలీ మొత్తం దేశాన్ని అవమానించాయి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మెలోనీకి అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రధానమంత్రి కార్యాలయ అండర్‌సెక్రటరీ జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి కూడా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “ఉద్దేశపూర్వకంగానో.. లేక అసమర్థత వల్లనో ట్రంప్ అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యల వల్ల యూరప్ అంతటా అమెరికాపై వ్యతిరేక భావన పెరుగుతోంది” అని ఆరోపించారు.
గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ నాయకుల్లో మెలోనీ ఒకరు. 2025లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. అయితే ఇరాన్ యుద్ధంపై పోప్ లియో చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ట్రంప్‌ను మెలోనీ ఇటీవల తప్పుబట్టడంతో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా మాటల యుద్ధంతో అమెరికా-ఇటలీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీ7 సదస్సు తర్వాత మెరుగుపడుతున్నాయని భావించిన ఇరుదేశాల సంబంధాలు మరోసారి సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!