NTV Telugu Site icon

Health Warnings: సిగరెట్‌పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్న ఆ దేశం

Sigarete

Sigarete

పొగాకు లాంటి మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరమని తెలుసు. పొగాకు వినియోగంతో కేన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. పొగాకు వాడొద్దని పలు దేశాల ప్రభుత్వాలు వార్నింగ్ ఇస్తున్నా.. జనాలు ఆ మాటను పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు కెనడా ప్రభుత్వం కూడా పొగాకు వాడకాలపై సందేశాలిచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సిగరెట్లపై పొగాకు పొగ పిల్లలకు హాని చేస్తుంది,సిగరెట్లు లుకేమియాకు కారణమవుతాయి, ప్రతి పఫ్‌లో విషం అనే మెస్సేజ్ లను ఇచ్చేందుకు రెడీ అయింది. అక్కడ త్వరలోనే ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో ఈ సందేశాలు కనిపించనున్నాయి. ప్రతి ఒక్క సిగరెట్‌పై నేరుగా ఆరోగ్య హెచ్చరికలను ముద్రించాలని కెనడా ప్రకటించింది. అలా చేసినా ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది.

Also Read : Gujarat News : భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే

2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కెనడా. అందులో భాగంగానే ఈ నియంత్రణ అమలు చేయనున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని ఆరోగ్య అధికారులు తెలిపారు. ‘‘కొత్త పొగాకు ఉత్పత్తుల స్వరూపం, ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలు.. ధూమపానం చేసే పెద్దలు మానేయడానికి, యువతను పొగాకు రహిత వినియోగదారులను నికోటిన్ వ్యసనం నుండి రక్షించడానికి, పొగాకు ఆకర్షణను మరింత తగ్గించడానికి కెనడా ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Also Read : Talasani Srinivas: ఫిష్ ఫెస్టివల్ ఏర్పాట్లపై మంత్రి తలసాని మీటింగ్

కెనడాలో పొగాకు వినియోగం ఎక్కువగా జరుగుతుండటంతో.. ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని కెనడా ప్రభుత్వం తెలిపింది. దీంతో అకాల మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి జీన్-వైవ్స్ డుక్లోస్ అన్నారు. పొగాకును అరికట్టేందుకు.. చర్యలు తీసుకుంటాన్నామన్నారు. అక్కడి యువకుల ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇలాంటి నివారణ చర్యలు తప్పవంటున్నారు. ఇక ఈ కొత్త నియమాలు ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి. అయితే అవి దశలవారీగా అమలు చేయబడతాయని కెనడా ప్రభుత్వం పేర్కొంది.

Show comments