ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ఇప్పుడు మరో భారీ భూకంపం వణికించింది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే సముద్రంలో సంభవించిన ఈ భూకంపం భూమిపై ప్రకంపనలు వచ్చాయా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.
అయితే నిన్న రాత్రి 7.6 తీవ్రతతో భారీ భూంకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. కరేబియన్ సముద్రంలో సంభవించిన ఈ భారీ భూకంపం ప్రభావం కోస్టారికా, నికరగువా, కొలంబియా, క్యూబా దేశాలపై ప్రభావం చూపించిందని సమాచారం. భారీ భూకంపం తీవ్రత దృష్ట్యా జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
Gentleman in Jamaica inquires:
What can he really do should a Tsunami truly hit the island.
Along with fear, it’s a question that is likely on many people’s mind as warnings of a possible tsunami broadcast throughout their areas.https://t.co/IYmoHbvhvv
— Biasedly Unbiased (@DiRealDan) February 9, 2025