Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Man Tries To Eat Noodles In Extreme Cold

Man Frozen With Noodles: వేడివేడి నూడుల్స్ తినాలనుకున్నాడు.. గడ్డకట్టుకుపోయాడు

Published Date :January 8, 2023 , 9:28 am
By NTV WebDesk
Man Frozen With Noodles: వేడివేడి నూడుల్స్ తినాలనుకున్నాడు.. గడ్డకట్టుకుపోయాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Man Tries To Eat Noodles In Extreme Cold: వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు.. వేడివేడి ఆహారాలు తినాలని అందరికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ఆరు బయట ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, వేడివేడి ఫుట్ ఐటమ్స్ తీసుకుంటే, అందులో వచ్చే కిక్కే వేరప్పా! సరిగ్గా అలాంటి అనుభూతినే పొందాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. మంచు కురుస్తున్న ప్రదేశానికి వెళ్లి.. వేడివేడి నూడుల్స్‌ తినాలని భావించాడు. కానీ.. ఇంటి నుంచిన బయటకు అడుగుపెట్టడమే ఆలస్యం, ఆ మంచులో అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. నూడుల్స్‌తో పాటు అతడు కూడా దాదాపు గడ్డకట్టుకుపోయే పరిస్థితిని చవిచూడాల్సి వచ్చింది.

Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా

ఆ వివరాల్లోకి వెళ్తే.. కెనడాకు చెందిన జేక్ ఫిషర్ అనే వ్యక్తి, అక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నూడుల్స్ తినాలని అనుకున్నాడు. ఇంట్లో వేడివేడిగా నూడుల్స్ సిద్ధం చేసుకొని, స్వెటర్ ధరించి ఆరుబయట కాలుమోపాడు. ఇక పొగలు కక్కుతున్న ఆ నూడుల్స్‌ని తినేందుకు స్పూన్ పెట్టి పైకెత్తాడు. అంతే.. అది గాల్లోనే గడ్డకట్టుకుపోయింది. కనురెప్పపాటులోనే స్పూన్‌తో పాటు నూడుల్స్ కూడా కదలకుండా, గాల్లో అలాగే ఉండిపోయాయి. కేవలం ఆ నూడుల్సే కాదు.. జేక్ జుట్టు, గడ్డం కూడా గడ్డకట్టుకుపోయాయి. ఈ పరిణామంతో ఖంగుతిన్న జేక్.. దీన్నంతా తన కెమెరాలో బంధించాడు. వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డిసెంబర్ 28వ తేదీన ఈ వీడియోని అతడు పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది.

Air India Urinating Case: ఫోన్ స్విచ్చాఫ్.. నిందితుడు మిశ్రా ఎలా చిక్కాడంటే?

ఈ వీడియోపై నెటిజన్లు సైతం కామెడీ కామెంట్లు చేస్తున్నారు. ‘అంత మంచు కురుస్తుందని తెలిసి, ఎవరు నిన్ను బయటికి వెళ్లమన్నాడు’ అంటూ ఒక నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేశాడు. మరొకరైతే.. గడ్డకట్టిన ఆ వ్యక్తి ‘అక్వామ్యాన్’లాగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇంకొకరైతే.. ఈ జేక్ నార్నియా ప్రాంతం నుంచి వచ్చాడంటూ కామెంట్ పెట్టాడు. నూడుల్స్ తినాలనుకున్న వ్యక్తే నూడుల్స్‌లా మారాడంటూ మరికొందరు సరదా కామెంట్లు చేసుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ice Toofan
  • Jake Fisher
  • Man Frozen With Noodles
  • Noodles Frozen
  • Winter Storm

తాజావార్తలు

  • India GDP Growth: భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన వరల్డ్‌ బ్యాంక్.. తగ్గేదేలే..!

  • Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions