Pakistan: పాకిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ దేశం, అక్కడి చట్టాలు కూడా ఇస్లామిక్ చట్టాలక అనుగుణంగానే ఉంటాయి. మరోవైపు అక్కడ స్త్రీలకు, వారి హక్కులకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఇక పెళ్లి తర్వాత స్త్రీని అనేది కేవలం ఒక సొత్తుగానే భావిస్తుంటారు. కొట్టినా, తిట్టినా, తమకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినా కూడా పాక్ చట్టాల్లో శిక్షలు విధించే సెక్షన్లు చాలా తక్కువ. ఇక లైంగిక విషయాల్లో భార్య తన భర్తపై కేసు పెట్టడం చాలా అరుదు. ఒక వేళ కేసు పెట్టినా కూడా న్యాయం లభిస్తుందనే హామీ లేదు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ చరిత్రలోనే ‘వైవాహిత అత్యాచారం’పై సంచలన తీర్పును వెలువరించింది అక్కడి కోర్టు. భార్య అనుమతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఒక వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 (అసహజ నేరాలు) కింద జావేద్ అనే వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేలింది. జైలు శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో నెల అదనంగా జైలులో ఉండాలని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
Read Also: PM Modi: ప్రధాని కీలక నిర్ణయం.. కోటి ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయం
వైవాహిక అత్యాచారాల్లో పాకిస్తాన్ చట్టాల్లో ప్రత్యేకమైన సెక్షన్లు లేవు. 2021 సెక్షన్ 375 కింద సవరణ ఆధారంగా స్వలింగ సంపర్కం అత్యాచారం చట్టం కిందకే వైవాహిక అత్యాచారం వస్తుందని న్యాయవాది బహ్జద్ అక్బర్ వాదించారు. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుని శిక్షను ఖరారు చేసింది. పాక్ లోని సింధ్ ప్రావిన్సులో ఇలాంటి కేసులో శిక్ష విధించడం ఇదే తొలిసారని అక్కడి వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి.
జూలై 2022లో జావెద్ అనే వ్యక్తికి ఓ యువతితో వివాహమైంది. పెళ్లి తర్వాత నుంచి భార్యపై వికృత చర్యలతో శృంగారం చేసేవాడు. భార్య వద్దంటున్న ఓరల్ సెక్స్ చేస్తుండేవాడు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త తల్లికి చెప్పినప్పటికీ, ఆమె కొడుకును వారించలేదు. దీంతో నవంబర్ 2022న భర్తపై కరాచీలోని చకివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
