NTV Telugu Site icon

Surprise in Flight: విమానం గాల్లో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌.. ఆమె ఏం చేసిందంటే..?

Surprise

Surprise

ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది.. వాళ్లు ప్రపోజ్‌ చేయడం.. సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మామూలుగా ఉండదు.. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే ఆలోచించాడు.. విమానం గాల్లో ఉండగా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ ముందు ప్రపోజల్‌ పెట్టాడు.. ఆమె ఎలా రియాక్ట్‌ అవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. విమానం గాల్లోకి ఎగిరి మార్గం మధ్యలో ఉన్న సమయంలో.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.. యూనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also:Biryani shops to shut down: బిర్యానీతో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది..! హోటల్‌ మూయించిన మున్సిపల్‌ చైర్మన్‌..

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల బ్రయన్‌ అనే వ్యక్తి… తన ప్రేయసి ముందు పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. బ్రయన్, స్టెఫానీ అనే యువతితో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాడు… అయితే.. ఆమెను ఎంతో ఇష్టపడ్డ అతను.. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.. అయితే, వినూత్న రీతిలో ఆమె ముందు తన మనసులో మాటను బయటపెట్టాలనుకున్నాడు. ఇంకేముందు.. దాని కోసం ముందే ప్లాన్‌ చేశాడు.. తాము విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తనను పెళ్లి చేసుకోమని ఆమెను కోరాలని నిర్ణయానికి వచ్చిన బ్రయన్‌.. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్‌కు చెప్పి ఒప్పించాడు.. ఏర్పాట్లన్నీ ముందుగానే జరిగిపోయాయి.. స్టెఫానీని సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెకు తెలీకుండానే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆ తరువాత… తన ప్లాన్‌ను బ్రయన్ అమలు చేయడంతో స్టెఫానీ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయిపోయింది. విమానంలో పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన తన ప్రియుడిని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుంది… నిన్నే పెళ్లాడతా అంటూ మురిసిపోతూ బదులిచ్చింది.. ఇక, ఈ ప్రపోజల్‌ ఫొటోలను తీసి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు.. ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.