Surprise in Flight: విమానం గాల్లో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్.. ఆమె ఏం చేసిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది.. వాళ్లు ప్రపోజ్ చేయడం.. సర్ప్రైజ్లు ఇవ్వడం మామూలుగా ఉండదు.. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే ఆలోచించాడు.. విమానం గాల్లో ఉండగా.. తన గర్ల్‌ఫ్రెండ్ ముందు ప్రపోజల్ పెట్టాడు.. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. విమానం గాల్లోకి ఎగిరి మార్గం మధ్యలో ఉన్న సమయంలో.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల బ్రయన్ అనే వ్యక్తి… తన ప్రేయసి ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. బ్రయన్, స్టెఫానీ అనే యువతితో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాడు… అయితే.. ఆమెను ఎంతో ఇష్టపడ్డ అతను.. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.. అయితే, వినూత్న రీతిలో ఆమె ముందు తన మనసులో మాటను బయటపెట్టాలనుకున్నాడు. ఇంకేముందు.. దాని కోసం ముందే ప్లాన్ చేశాడు.. తాము విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తనను పెళ్లి చేసుకోమని ఆమెను కోరాలని నిర్ణయానికి వచ్చిన బ్రయన్.. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్‌కు చెప్పి ఒప్పించాడు.. ఏర్పాట్లన్నీ ముందుగానే జరిగిపోయాయి.. స్టెఫానీని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెకు తెలీకుండానే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆ తరువాత… తన ప్లాన్‌ను బ్రయన్ అమలు చేయడంతో స్టెఫానీ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయింది. విమానంలో పెళ్లి ప్రపోజల్ పెట్టిన తన ప్రియుడిని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుంది… నిన్నే పెళ్లాడతా అంటూ మురిసిపోతూ బదులిచ్చింది.. ఇక, ఈ ప్రపోజల్ ఫొటోలను తీసి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు.. ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!