Site icon NTV Telugu

భార‌త ప‌ర్యాట‌కుల‌కు ఆ దేశంలోకి నో ఎంట్రీ…

భార‌త్ నుంచి ఎక్కువ మంది ప‌ర్య‌ట‌న‌ల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు.  అలా మాల్థీవుల‌కు వెళ్లే భార‌త ప‌ర్యాట‌కుల‌పై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది.  భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో ఆ దేశం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో పాటు ద‌క్షిణాసియా దేశాల్లో ప‌ర్య‌టించిన ప‌ర్యాట‌కుల‌పై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది.  అన్ని ర‌కాల వీసాల‌పై ఈ నిషేదం వ‌ర్తిస్తుంద‌ని ఆ దేశ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ట్వీట్ చేశారు.  మే 13 నుంచి ఈ నిషేదం అమ‌లులోకి రానున్న‌ది.  భారత్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అనేక దేశాలు భారత్ పై తాత్కాలికంగా నిషేదం విధించాయి.  మొద‌టి వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టిన స‌మ‌యంలో ఇండియాకు చెందిన సెలెబ్రిటీలు అనేక మంది మాల్ధ‌వుల‌కు వెళ్లి అక్క‌డ ఎంజాయ్ చేసిన సంగ‌తి తెలిసిందే.  

Exit mobile version