Site icon NTV Telugu

Trump: వెనిజులా తర్వాత మీరే.. ఈ దేశాలకు ట్రంప్ బిగ్ వార్నింగ్..

Trump

Trump

Trump: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, వారిని అమెరికాకు తీసుకువచ్చారు. అయితే, అమెరికా చేసిన ఈ దాడిని ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు, వెనిజులా అమెరికాలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోందని, మదురోకు ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, ట్రంప్ వెనిజులా ఆయిల్, ఇతర ఖనిజ సంపదపై కన్నేసి ఈ దుందుగుకు చర్యలకు పాల్పడ్డారని అంటున్నారు.

Read Also: Healthy Lifestyle Tips: డైటింగ్ కాదు, జీవన నాణ్యతే కీలకం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఇలా ఫాలో అవ్వండి..!

మరోవైపు, అమెరికా తీరును మెక్సికో, క్యూబా, కొలంబియా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెనిజులా అయిపోయిందని నెక్ట్స్ తమ టార్గెట్ మెక్సికో, క్యూబా, కొలంబియా కావచ్చని ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. వీరంతా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపించారు. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత, అమెరికానే వెనిజులాను పాలిస్తుందని ట్రంప్ చెప్పారు.

నార్కో టెర్రరిజం నెట్వర్క్‌కు మదురో నాయకత్వం వహిస్తున్నారని, అమెరికన్ల జీవితాలను నాశనం చేస్తున్నడని ట్రంప్ తన దాడిని సమర్థించుకుంటున్నాడు. కొకైన్, ఫెంటానిల్‌తో సహా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను వెనిజులా యూఎస్‌కు స్మగ్లింగ్ చేస్తుందని అన్నారు. మదురో తొలగింపు తర్వాత, వెనిజులా చమురు నిల్వలను అమెరికా టేక్‌ఓవర్ చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. వెనిజులాలో మౌలిక సదుపాయాలను సరిచేస్తామని చెప్పారు.

Exit mobile version