Ajit Dhoval: చైనాపై నమ్మకం పోయింది: అజిత్ ధోవల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Dhoval: రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు రెండు దేశాల మధ్య ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే భారత చైనాతోనూ, పాకిస్థాన్‌తోనూ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి యుద్ధానికి సైతం దారితీస్తాయి. ఇప్పటి వరకు గతంలో చైనాతో.. పాకిస్థాన్‌తో యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనాపై తమకు నమ్మకం సన్నగిల్లుతోందని భారత జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ సంచనల వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందుగా జోహన్సెస్‌బర్గ్ లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Read also; Pilli Subhash Chandra Bose: వైసీపీకి బిగ్ షాక్..! జగనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్..?
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్‌కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందని.. రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. చైనా దూకుడు తగ్గించుకుంటేనే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. ఇందుకు వాంగ్ యీ స్పందిస్తూ… చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చనని తెలిపారు.
- Tags
- Ajit Dhoval
- diplomat
- Faith
- In China
- Lost
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?