Site icon NTV Telugu

Nirav Modi: నీరవ్‌ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్.. భారత్‌కు అప్పగించేదెప్పుడంటే..!

Nirav Modi

Nirav Modi

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లలో మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలును యూకే అధికారులు పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. తాజా దాడుల్లో ఆరుగురు మృతి

ఇదిలా ఉంటే తన అప్పగింతను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ మరోసారి కోర్టును ఆశ్రయించారు. భారత్‌కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. అలాంటి పనులకు పూనుకోబోమని హామీ పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. దీంతో నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Italy: ఇటలీ విహారయాత్రలో విషాదం.. నాగ్‌పూర్‌కు చెందిన దంపతుల మృతి

2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు బయటపడింది. ఈ కేసును ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అప్పటికే నీరవ్ మోడీ దేశం దాటిపోయాడు. 2018 డిసెంబర్‌లో నీరవ్ మోడీ తమ దేశంలోనే ఉన్నాడని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. దీంతో 2019 మార్చిలో నీరవ్ మోడీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2021లోనే అప్పగించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మొత్తానికి ఇన్నాళ్లకు నీరవ్ మోడీ అప్పగింతకు లైన్ క్లియర్ అయింది.

Exit mobile version