NTV Telugu Site icon

Pakistan: ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ చేతిలో హఫీస్ సయీద్ సన్నిహితుడి హతం.. భారత వ్యతిరేకులే టార్గెట్..

Pak

Pak

Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్‌లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.

Read Also: Mallidi Krishna: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్ తమ్ముడు

తాజాగా రంజాన్ రోజునే లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు ఫైనాన్షియర్‌గా, 26/11 ఉగ్రవాదుల సూత్రధారి హఫీస్ సయీద్ సన్నిహితుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడిని అబ్దుల్ రెహమాన్‌గా గుర్తించారు. పాక్ వాణిజ్య నగరం కరాచీలో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, బైక్‌పైన వచ్చిన వ్యక్తులు దుకాణంలో నిలబడి ఉన్న రెహమాన్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

రెహ్మాన్ లష్కరే తోయిబాకు ఆర్థిక సాయం అందిస్తున్న అగ్రశ్రేణి ఫైనాన్షియర్లలో ఒకరు. పాకిస్తాన్, భారత్ వ్యాప్తంగా వివిధ దాడులకు లష్కరే తోయిబా కారణం. రెహమాన్ కరాచీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈ ఉగ్రసంస్థకు నిధులు సేకరించే పని చేస్తున్నాడు. ఇటీవల లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్, ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. అబూ ఖతర్ 2017 రియాసి బాంబు పేలుడు, 2023 జమ్మూ కాశ్మీర్ యాత్రికులు బస్సుపై దాడి చేసిన ఘటనలో కీలక సూత్రధారి.