Bangladesh: ఆందోళనకారుల్ని “కాల్చి వేయాలని” షేక్ హసీనా ఆదేశాలు..
- షేక్ హసీనా ఫోన్ కాల్ లీక్..
- విద్యార్థులపై కాల్చివేత ఉత్తర్వులు..
- గతేడాది బంగ్లాదేశ్‌లో తీవ్ర హింస..
- హింస కారణంగా రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే, గత సంవత్సరం జరిగిన సామూహిక నిరసనల సందర్భంగా విద్యార్థులపై కాల్పులు జరపాలని షేక్ హసీనా భద్రతా బలగాలను ఆదేశించారని బీబీసీ ధ్రువీకరిస్తూ లీక్ అయిన ఫోన్ కాల్ గురించి నివేదించింది. ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేయాలని చెబుతున్నట్లు ఆడియో లీక్‌లో ఉంది. జూలై 18, 2024న ఢాకాలోని తన అధికారిక నివాసం నుండి చేసిన ఫోన్ కాల్‌లో ‘‘నేను వారందరినీ ఈ రాత్రి అరెస్టు చేయాలని ఆదేశించాను. అందరికీ సమాచారం అందింది, మీరు వారిని ఎక్కడ కనుగొంటే, వారిని పట్టుకోండి. నేను బహిరంగ ఉత్తర్వు జారీ చేసాను. ఇప్పుడు, వారు ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగిస్తారు. వారు కనిపిస్తే కాల్చివేయండి’’ అని ఫోన్ కాల్‌లో షేక్ హసీనా చెప్పారు.
Also Read
- Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది!
- Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
- Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై గతేడాది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. చివరకు ఈ అల్లర్లు షేక్ హసీనా పదవి పోవడానికి కారణమైంది. ఈ అల్లర్ల అణచివేతలో 1400 మంది వరకు మరణించినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌లో దారుణమైన హింస ఇదే.
మానవత్వానికి విరుద్ధంగా జరిగిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాపై బంగ్లాదేశ్ లో కేసులు ఫైల్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఆడియో లీక్‌ని ఉపయోగించుకోవాలని బంగ్లా ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నారు. ఆగస్టు 5న ఢాకాలోని జత్రాబారి పరిసరాల్లో అత్యంత దారుణమైన మారణహోమం జరిగింది, అక్కడ సైన్యం ఆ ప్రాంతం నుండి వైదొలిగిన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొత్తగా బయటపడిన ఆధారాల ప్రకారం, కనీసం 52 మంది మరణించారు. ఇది మునుపటి నివేదిక కన్నా ఎక్కువ. హసీనాతో పాటు, మాజీ పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులతో సహా 203 మందిపై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) నేరారోపణలు చేసింది, 73 మంది కస్టడీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
-
Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
-
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ భారీ విజయం.!
-
Prabhas : తన మూవీస్‌కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్
-
Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!