NTV Telugu Site icon

Oracle: కొనసాగుతున్న లేఆఫ్స్.. ఒరాకిల్‌లో మరో విడత ఉద్యోగుల తొలగింపు

Oracle

Oracle

Oracle: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా మరో సారి తన ఉద్యోగులను తొలగించింది. ఈ సారి ఒరాకిల్ ఆరోగ్య విభాగం ప్రభావితం కానుంది. ఇంతకుముంద ఐటీ డివిజన్ లో ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో పలువురు భారతీయ ఉద్యోగులు కూడా ప్రభావితం అయ్యారు.

Read Also: karnataka congress: జూన్ 21న ఢిల్లీకి కర్ణాటక మంత్రులు.. రమ్మని పిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు

తాజా తొలగింపుల్లో భాగంగా ఉద్యోగుల ఆఫర్ లెటర్లను కూడా క్యాన్సిల్ చేస్తోంది. డిసెంబర్ 2021లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌‌ని 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తాజాగా దీని నుంచే ఉద్యోగులను తొలగించబోతోంది. లేఆఫ్ జాబితాలోని ఉద్యోగులకు మిగిలిన సర్వీస్ కు సంబంధించి ఏటా నాలుగు వారాల వేతనంతో పాటు మరో వారం అదనంగా చెల్లించడంతో పాటు సెలవులకు డబ్బులు ఇవ్వనున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో ఈ కోతలు ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ కు సంబంధించి ఇప్పటికి ఏ సమాచారం లేదు.

ఆర్థికమాంద్య ప్రభావం, ఖర్చులను తగ్గించుకునేందుకు పలు సంస్థలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒరాకిల్ కూడా మరో విడతలో ఉద్యోగులను తొలగించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ 3000 మందిని తొలగించింది. దీంతో పాతటు కంపెనీలో జీతాల పెంపు, ప్రమోషన్లను కూడా నిలిపివేసింది.