Site icon NTV Telugu

Laura Loomer: అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి.. రిపబ్లికన్ నేత డిమాండ్

Laura Loomer

Laura Loomer

అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని రిపబ్లికన్ నేత, దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది. రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థి, హక్కుల కార్యకర్త లారా లూమర్ శుక్రవారం సాయంత్రం కీలక పోస్ట్ చేసింది. తన విధాన డిమాండ్లను తీర్చకపోతే రాజకీయ అభ్యర్థులను తాను ఇకపై ఆమోదించనని.. అంతేకాకుండా మద్దతు ఇవ్వను అని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె పలు డిమాండ్లు చేసింది. అమెరికాలో హలాల్ జంతు బలిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించడం, బంధువుల వివాహాలపై సమాఖ్య నిషేధం, హమాస్, ముస్లిం బ్రదర్‌హుడ్‌లకు నిధులు సమకూర్చినందుకు ఖతార్‌ను ఖండించడం, బుర్ఖా, హిజాబ్‌పై నిషేధానికి మద్దతు ఇవ్వడం, స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనాన్ని సమాఖ్య నేరంగా చేయడం వంటివి డిమాండ్ చేసింది. అలాగే అమెరికా గడ్డపై విదేశీ సైనిక స్థావరాలను నిషేధించాలని.. ఖురాన్‌పై ప్రమాణం చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొంది.

ఇది కూడా చదవండి: Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం

‘‘నా దేశాన్ని ఇస్లామీకరణ చేయడం ఏ మాత్రం అంగీకరించబోను.. అమెరికా గడ్డను మహమ్మద్ చేతుల్లో బలి కానివ్వను.’’ అని సొంత పార్టీపై ఆమె ధ్వజమెత్తింది. తన పోరాటంపై మద్దతు తెల్పాలని పార్టీ నేతలను కోరారు.

ఇటీవల న్యాయార్క్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే జోహ్రాన్ మమ్దానీ, డెమొక్రటిక్ పార్టీపై కూడా మండిపడ్డారు. తాజాగా ఈ జాబితాలో లారా లూమర్ చేరారు. ఇటీవల అమెరికాలో హనుమాన్ విగ్రహం ఏర్పాటుపై రిపబ్లికన్ నేత తప్పుపట్టగా.. తాజాగా లారా లూమర్ ముస్లిం విధానాన్ని తప్పుపట్టారు.

ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!

 

Exit mobile version