Kim Jong Un: కిమ్ తర్వాత నార్త్ కొరియా నియంతగా “జు ఏ”.. ఆమె మరెవరో కాదు..
- కిమ్ తర్వాత నార్త్ కొరియా నియంతగా జు ఏ..
- కిమ్ ముద్దుల కుమార్తెగా జు ఏ గుర్తింపు..
- ఇటీవల చైనా పర్యటన మెరిసిన జు ఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి అసలు తెలియదు. ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారో అంతే సంగతి. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో నార్త్ కొరియా మగ్గిపోతోంది. అక్కడ ఉన్న ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియకుండా బతుకుతున్నారు. చిత్రవిచిత్రమైన రూల్స్, శిక్షలు ఒక్క ఉత్తర కొరియాలోనే సాధ్యం.
ఇదిలా ఉంటే, కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఉత్తర కొరియాకు కొత్త నాయకులు ఎవరు అవుతారు, ఆయన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారనే ప్రశ్న చాలా కాలంగా ఉత్పన్నమవుతోంది. అయితే, దీనికి ‘‘జు ఏ’’ అనే సమాధానం దొరుకుతోంది. ఆమె మరెవరో కాదు, కిమ్ ముద్దుల కూతురు. ఇటీవల బీజింగ్ లో కిమ్ ఉన్నతస్థాయి పర్యటనలో కిమ్‌తో పాటు ఆయన కూతురు జు ఏ కూడా ఉణ్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన వారసురాలు జు ఏ అని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ గురువారం తెలిపింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
Read Also: Shivam Dube: అతడు నా వెంట పడ్డాడు.. ఆసక్తికర విషయం చెప్పిన శివమ్ దూబే!
ఈ నెల ప్రారంభంలో ఆమె తన తండ్రితో కలిసి తన మొదటి అధికారిక విదేశీ పర్యటన చేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిసింది. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే, విశ్లేషకులు ఆమెను కిమ్ వారసురాలిగా చాలా కాలంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం జు ఏకు అన్నయ్య ఉన్నారని, అతడిని ఒక రహస్య ప్రదేశంలో తదుపరి దేశాధినేతగా తీర్చిదిద్దుతున్నారనే వాదన కూడా ఉంది. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ప్రకారం, ఆమెను తదుపరి ఉత్తర కొరియా అధినేతగా చూస్తున్నట్లు అంచనా వేస్తోంది.
2022లో తొలిసారిగా జు ఏ తన తండ్రి కిమ్‌తో కలిసి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సమయంలో కనిపించింది. ఆ సమయంలో ఆమె బహిరంగ ప్రపంచానికి పరిచయమైంది. ఉత్తర కొరియా మీడియా ఆమెను ‘‘ప్రియమైన బిడ్డ’’ అని సంబోధిస్తుంది. కొరియన్ భాషలో ‘‘హయాంగ్డో’’గా పేర్కొంది. దీనిని సాధారణంగా అగ్ర నాయకులు, వారి వారసులకు కేటాయిస్తారు. జు ఏ ఉన్నట్లు తొలిసారిగా ఎన్బీఏ స్టార్ డెన్నిస్ రాడ్‌మన్ ప్రకటన ద్వారా తెలిసింది. 2013లో ఆయన నార్త్ కొరియాను సందర్శించిన సమయంలో కిమ్ కూతురు జు ఏని కలిసినట్లు పేర్కొన్నారు. కిమ్, ఆయన భార్య రి కి 2010లో మొదటి సంతానంగా ఒక అబ్బాయి ఉన్నాడని, రెండో సంతానంగా కూతురు ఉందని సౌత్ కొరియా చెప్పింది. అయితే, ఆయన కొడుకు ఉనికిని మాత్రం ఇప్పటి వరకు నిర్ధారించలేకపోయింది.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!