Site icon NTV Telugu

ఘోరం: తినడానికి డబ్బులు లేక కిడ్నీలు అమ్ముకొంటున్నారట

afghanisthan

ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు కిడ్నీలను అమ్ముకుంటున్నారు.

ఆసుప్రతి వద్ద భారీ సంఖ్యలో నిలబడి ఉన్న ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతుంది అక్కడ ఉన్న పరిస్థితి. ఒక్క కిడ్నీ  రు. 1.69 లక్షలు పలుకుతుంది. ఒక్క కిడ్నీ అమ్మితే తమ కుటుంబం కొన్ని రోజులు మూడు పూటలా అన్నం తినగలుగుతుందని వారు ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు తెలిపారు. ఒక్క కిడ్నీ అనే కాకుద్నా దాతలకు ఏ అవయవం కావాలన్నా ఇస్తామని వారు చెప్పడం మనసును కలిచివేస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ లకు ఇలాంటి దుర్బర పరిస్థితి రావడానికి కారణం తాలిబన్లే అంటున్నారు అక్కడివారు. వారి పాలన దారుణంగా ఉండబట్టే వీరు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారని వాపోతున్నారు. మరి ఈ గడ్డు పరిస్థితి నుంచి ఈ ప్రజలు ఎప్పుడు బయటపడతారు.. వీరి కోసం ఈ అంతర్జాతీయ సమాజం ముందుకు వస్తుందో చూడాలి.

Exit mobile version