Indian Origin Family Murder : పాత కక్షలతోనే భారత సంతతి కుటుంబం హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Origin Family Murder : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబీకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం హత్యకు గురి కావడానికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, పెదనాన్న అమన్‌దీప్‌సింగ్ కిడ్నాప్‌కు గురయ్యారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన మూడు రోజులకు ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు స్థానికంగా ఉన్న వ్యవసాయ భూమిలో లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. కిడ్నాప్ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే 48ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో జస్దీప్ సింగ్ కు చెందిన ట్రక్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసినట్లు దర్యాప్తులో తేలినట్టు పోలీసులు తెలిపారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
Read Also: Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం
పోలీసుల కథనం ప్రకారం.. జస్దీప్ సింగ్ కంపెనీలో నిందితుడు సల్గాడో డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సందర్భంగా వారి మధ్య గొడవలు జరిగడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇది మనసులో పెట్టుకున్న సల్గాడో అప్పట్లో సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కుటుంబం అంతటిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. పలు కేసుల్లో అతడు 10 ఏండ్లు జైల్లో ఉండి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ మరణాలపై మెర్సిడ్ కౌంటి పోలీసు అధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు వచ్చే కోపాన్ని పదాల్లో వర్ణించలేనని.. నేరానికి పాల్పడిన వ్యక్తికి నరకంలో ప్రత్యేక స్థానం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?