Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Khawaja Asif Say Saudi Arabia Will Defend Pakistan In Case Of War With India

Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published Date :September 20, 2025 , 1:05 pm
By Suresh Maddala
  • భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది
  • పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశంతో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జియో టీవీతో మాట్లాడుతుండగా భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ సపోర్టుగా వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వస్తుంది… అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్

ఇటీవల పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. రెండు దేశాలపై దాడి చేసినట్లుగా పరిగణించాలని ఉద్దేశం.. అప్పుడు రెండు దేశాలు కలిసి శత్రువుపై పోరాటం చేయాలనేది ఈ రక్షణ ఒప్పందం యొక్క సారాంశం. ప్రస్తుతం ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ విశ్లేషిస్తోంది.

ఇది కూడా చదవండి: Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా

పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తే కచ్చితంగా సౌదీ అరేబియా వచ్చి ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. అలాగే సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే.. మిత్ర దేశానికి అణ్వాయుధాలు అందిస్తామని పేర్కొన్నారు. రక్షణ ఒప్పందంలో వ్యూహాత్మక పరస్పర సహాయం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాటో తరహాలో ఇస్లామిక్ నాటో బలపడుతుందని చెప్పారు.

ఇదిలా ఉంటే రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అణ్వాయుధాలు ఒప్పందంలో భాగం కాదన్నారు. తాజాగా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అణ్వాయుధాలను సౌదీకి అందిస్తామని విరుద్ధ ప్రకటన చేశారు.

23

వాస్తవంగా భారత్-సౌదీ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రియాద్‌లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా జరిగాయి. మోడీ మూడు సార్లు సౌదీకి వెళ్లారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్‌ను మోడీకి ప్రదానం చేశారు. భారతదేశం ఇప్పుడు సౌదీకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ రియాద్ పర్యటన సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ ఖండించింది. ఏ కారణం చేతనైనా ఉగ్ర దాడిని సమర్థించేది లేదని సౌదీ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా సౌదీ ఖండించింది. కానీ తాజాగా పాక్‌తో రక్షణ ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Defend pakistan
  • Khawaja Asif
  • Pakistan defence minister
  • saudi arabia
  • War india

తాజావార్తలు

  • Mega 158: మెగాస్టార్ – బాబీ కొల్లి క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్.. జోడీ ఎవరంటే?

  • UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు

  • Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!

  • Rajasekhar: నా గోళీల ఫ్యాక్టరీ మాత్రం వదిలిపెట్టను

  • Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions