భారతదేశంతో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జియో టీవీతో మాట్లాడుతుండగా భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ సపోర్టుగా వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వస్తుంది… అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్
ఇటీవల పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. రెండు దేశాలపై దాడి చేసినట్లుగా పరిగణించాలని ఉద్దేశం.. అప్పుడు రెండు దేశాలు కలిసి శత్రువుపై పోరాటం చేయాలనేది ఈ రక్షణ ఒప్పందం యొక్క సారాంశం. ప్రస్తుతం ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ విశ్లేషిస్తోంది.
ఇది కూడా చదవండి: Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా
పాకిస్థాన్‌పై భారతదేశం దాడి చేస్తే కచ్చితంగా సౌదీ అరేబియా వచ్చి ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. అలాగే సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే.. మిత్ర దేశానికి అణ్వాయుధాలు అందిస్తామని పేర్కొన్నారు. రక్షణ ఒప్పందంలో వ్యూహాత్మక పరస్పర సహాయం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాటో తరహాలో ఇస్లామిక్ నాటో బలపడుతుందని చెప్పారు.
ఇదిలా ఉంటే రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అణ్వాయుధాలు ఒప్పందంలో భాగం కాదన్నారు. తాజాగా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అణ్వాయుధాలను సౌదీకి అందిస్తామని విరుద్ధ ప్రకటన చేశారు.
వాస్తవంగా భారత్-సౌదీ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రియాద్‌లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా జరిగాయి. మోడీ మూడు సార్లు సౌదీకి వెళ్లారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్‌ను మోడీకి ప్రదానం చేశారు. భారతదేశం ఇప్పుడు సౌదీకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ రియాద్ పర్యటన సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ ఖండించింది. ఏ కారణం చేతనైనా ఉగ్ర దాడిని సమర్థించేది లేదని సౌదీ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా సౌదీ ఖండించింది. కానీ తాజాగా పాక్‌తో రక్షణ ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో..!
