పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఖాయమన్నట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ టార్గెట్‌గా ఖవాజా ఆసిఫ్ నోరుపారేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ అంటూ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. రెచ్చగొడితే 50 రెట్ల బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. దోహా మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్‌లో కాల్పుల విరమణపై పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య రెండో రౌండ్ జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే చర్చల సమయంలో ఆఫ్ఘన్ మధ్యవర్తులు పదే పదే వెనక్కి తగ్గారని డాన్ పత్రిక నివేదించింది. చర్చలకు పాకిస్థాన్ ముందుకు వచ్చినా.. ఆప్ఘనిస్థాన్ ఒప్పందానికి ముందుకు రావడం లేదని జియో న్యూస్ పేర్కొంది. కాబూల్ నేతలు.. శాంతి ప్రక్రియను దెబ్బతీస్తున్నారని వర్గాలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పరోక్షంగా ఆప్ఘనిస్థాన్‌ను భారతదేశం ఉసిగొల్పుతోందని నోరుపారేసుకున్నారు. భారత్ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశాన్ని ఉపయోగించుకుంటుందన్నారు. తోలుబొమ్మల ప్రదర్శనలో ఆడించినట్లుగా కాబూల్‌ను ఢిల్లీ నియంత్రిస్తోందని వ్యాఖ్యానించారు. కాబూల్‌కు సామర్థ్యం లేకపోయినా.. భారతదేశం మద్దతు చూసుకుని విర్రవీగుతోందని చెప్పుకొచ్చారు. ఎవరైనా పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఖవాజా ఆసిఫ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇస్లామాబాద్ వైపు ఎవరు చూసినా వారి కళ్లను పెకిలించివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొడితే 50 రెట్లు బలంగా పాకిస్థాన్ ప్రతిస్పందన ఉంటుందన్నారు.
