Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Khameneiwill Reveals Shocking Secrets Mojtaba Controversial Appointment As Iran Supreme Leader

Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!

Published Date :March 11, 2026 , 8:02 am
By Suresh Maddala
  • వెలుగులోకి ఖమేనీ వీలునామా!
  • వీలునామాలో షాకింగ్ రాతలు
  • వ్యతిరేకంగా తాజా నిర్ణయాలు
Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అయతుల్లా అలీ ఖమేనీ.. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నత పదవిలో ఉండగా గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు.

ఇక ఖమేనీ హతమయ్యాక.. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడైన మోజ్తాబా నియమితులయ్యారు. శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మోజ్తాబాను ఖమేనీ స్థానంలో కూర్చుండ బెట్టింది. అయితే మోజ్తాబాను ఇరాన్ సుప్రీం లీడర్‌గా నియమించడంపై ఇరాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు ప్రజల్లోనూ.. ఇటు మతాధికారుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వచ్చినట్లుగా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Add as a preferred
source on google

ఖమేనీ వీలునామా..
ఇదిలా ఉండగా తాజాగా ఖమేనీ రాసిన వీలునామా వెలుగులోకి వచ్చింది. ఇందులో సంచలన విషయాలను పొందుపరిచారు. తన వారసుడిగా.. ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంలో కుమారుడైన మోజ్తాబాను నియమించవద్దని వీలునామాలో స్పష్టంగా రాసినట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. తన వారసుడిగా కుమారుడిని నియమించడం ఏ మాత్రం ఇష్టం లేదని ఖమేనీ వీలునామాలో స్పష్టంగా రాసినట్లుగా తెలిపింది.

వాస్తవంగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబాను నియమించడం చాలా మందికి ఇష్టం కూడా లేదని కథనంలో తెలిపింది. చాలా తక్కువ మంది మాత్రమే కోరుకున్నారని పేర్కొంది. తన వారసుడిగా ఆ స్థానంలో ఉండటానికి మోజ్తాబా ఏ మాత్రం సరిపోడని ఖమేనీ పొంది పరిచినట్లుగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరానియన్ నిఘా నెట్‌వర్క్‌లతో సంబంధాలున్న ప్రతిపక్ష గ్రూప్ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ పరిశోధన డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఈ మేరకు తెలియజేసినట్లుగా కథనంలో రాసుకొచ్చింది.

దేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం, రాజకీయ సామర్థ్యం మోజ్తాబాకు లేదని ఖమేనీ నమ్ముతారని ఖోస్రో ఇస్ఫహానీ అన్నారు. మోజ్తాబా ఒక నపుంసక మతాధికారి మాత్రమేనని.. రాజకీయ జీవితంలో సాధించింది కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. వాస్తవంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత క్లరికల్ సంస్థ అయిన నిపుణుల సభ నిర్ణయిస్తుందని.. కానీ ఆ విధంగా జరగలేదన్నారు. అంతా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడి మేరకు జరిగిపోయిందని స్పష్టం చేశారు.

మోజ్తాబా కౌన్సిల్ నుంచి మెజారిటీ ఓట్లను కూడా పొందలేదని.. కేవలం IRGC ఒత్తిడి కారణంగా జరిగిందని.. చాలా మంది మతాధికారులు వారసుడిని అధికారికంగా ప్రకటించిన తర్వాత సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయరని ఖోస్రో ఇస్ఫహానీ చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది మతాధికారులు మోజ్తాబా నియామకాన్ని వ్యతిరేకించారని తెలిపారు. మోజ్తాబాను ఒక తోలు బొమ్మలా చూస్తారని.. తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ విధంగా చేసిందని ఖోస్రో ఇస్ఫహానీ వెల్లడించారు.

ఇక మోజ్తాబా నియామకాన్ని ట్రంప్ కూడా తప్పుపట్టారు. శాంతియుతంగా ఎంత కాలం జీవించలేరని హెచ్చరించారు. వెనిజులా తరహాలోనే ఇరాన్‌లో కూడా తమ పాత్ర ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త లీడర్‌ను కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ali Khamenei
  • Iran Leadership Succession
  • Iran Supreme Leader successor
  • IRGC influence
  • Khamenei

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions