Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్‌లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు. అదే సమయం దేశాన్ని యుద్ధంలోకి నెడుతోందని చెప్పారు. ఇరాన్ జాతీయ స్థాయిలో సంయమనం పాటిస్తోందని, అయితే హింసకు కారణమని భావిచే వారి పట్ల సహనం చూపమని చెప్పారు. ‘‘మేము దేశాన్ని యుద్ధంలోకి లాగము, కానీ దేశీయ-అంతర్జాతీయ నేరస్తుల్ని శిక్షించకుండా ఉండము’’ అని స్పష్టం చేశారు.
Read Also: Harsha Vardhan : దొంగ మనసు మార్చేకన్నా ఇంటికి తాళం వేయడం బెటర్.. అనసూయకి హర్షవర్ధన్ కౌంటర్!
ఇరాన్ వ్యాప్తంగా ఇటీవల నిరసనలకు అమెరికా కుట్ర కారణమని, ఇరాన్‌ను వశపరుచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ట్రంప్ స్వయంగా ఈ అంశాంతిలో జోక్యం చేసుకున్నారని, అల్లర్లను ప్రోత్సహించాడని, సైనిక మద్దతు ఇస్తామని నిరసనల్ని ప్రోత్సహించాడని ఖమేనీ అన్నారు. ఇరాన్‌ను విధ్వంసకారుల దేశంగా చిత్రీకరించాలని చూశాడని ఆరోపించారు. ఇరాన్ దేశంలో అల్లర్ల వెన్ను విరిచినట్లు గానే, ఈ నిరసనల వెనక ఉన్న దేశీయ, అంతర్జాతీయ నేరస్తుల్ని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఇటీవల, ఇరాన్ వ్యాప్తంగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల్ని ఇరాన్ ఆర్మీ అణిచివేసింది. ఇరాన్ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలలో 3,000 మందికి పైగా మరణించారని హక్కుల కార్యకర్తలు తెలిపారు.
