Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్‌లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు.