Site icon NTV Telugu

Pakistan: ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ప్రసంగంతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..

Imran Khan

Imran Khan

Pakistan: మాజీ ప్రధాని, అవినీతి ఆరోపణపై జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ చేసిన ఒక్క ప్రసంగం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఖాసిం ఖాన్ మాట్లాడుతూ.. తన తండ్రిని వెంటనే విడుదల చేసేలా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. “ఇమ్రాన్ ఖాన్‌పై వేధింపులను తక్షణమే ఆపాలని పాకిస్తాన్‌ను కోరాలని మేము ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ అభిప్రాయాన్ని అనుసరించి ఆయనను విడుదల చేయాలి” అని అన్నారు.

Read Also: Iran Strikes Kuwait: కువైట్, దుబాయ్‌లపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!

అయితే, ఖాసిం ఖాన్ ప్రసంగంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ప్రసంగం ద్వారా దేశానికి సంబంధించిన జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ (GSP ప్లస్) హోదాను బలహీనపరిచేందుకు ప్రయత్నించారని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ హోదా ద్వారా పాకిస్తాన్ ఉత్పత్తుల ఎగుమతులపై తక్కువ ఈయూ తక్కువ సుంకాలు విధిస్తుంది. ఆ దేశ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. ఇది పాకిస్తాన్ జీఎస్పీ ప్లస్ హోదాను బలహీనపరిచే ‘‘దేశ వ్యతిరేక కుట్ర’’గా అభివర్ణించారు. పాకిస్తాన్ వ్యతిరేక బృందం యూరోపియన్ యూనియన్‌లో ఇజ్రాయిల్ లాబీతో, నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)తో కలిసి పనిచేస్తుందని పాక్ మంత్రులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version