Site icon NTV Telugu

Pakistan Stock Market: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్

Stock

Stock

Pakistan Stock Market: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 80 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే, ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత KSE-100 సూచీ 3.7 శాతం క్షీణించగా, దేశీయ సెన్సెక్స్ సూచీ దాదాపు 1.5 శాతం పెరిగింది.

Read Also: Benz : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మలయాళ హీరో

అయితే, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ & కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ యొక్క KSE-100 సూచిక సుమారు 4 శాతం మేర క్షీణించింది. ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు, భారత స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. భారత్‌-పాక్‌ల మధ్య భగ్గుమంటోన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో.. తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి వచ్చాయి. భారత స్టాక్ మార్కెట్లు ఉదయం 10 గంటల నాటికి, సెన్సెక్స్ కేవలం 32 పాయింట్లు ఉండగా.. నిఫ్టీ 50 పాయింట్లకు చేరుకుంది.

Exit mobile version