Julian Assange: అస్సాంజేకి విముక్తి.. సుదీర్ఘ వివాదానికి ముగింపు..
- వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకి విముక్తి..
- ఒప్పందంలో భాగంగా స్వేచ్ఛ ప్రసాదించిన అమెరికా..
- యూఎస్ రహస్యాలను బహిర్గతం చేసి సంచలనం..
- సొంత దేశం ఆస్ట్రేలియాకు పయణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Julian Assange: అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల రహస్యాలను వెల్లడించి సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి విముక్తి లభించింది. అమెరికాకు చెందిన పసిఫిక్ ద్వీప భూభాగంలోని సైపాన్ లోని బుధవారం విడుదల చేసింది. అతను స్వదేశం ఆస్ట్రేలియాకు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మూడు గంటల విచారణ సమయంలో, అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందేందుకు, బహిర్గతం చేయడానికి కుట్ర పన్నినట్లుగా నేరారోపణను అసాంజే అంగీకరించాడు. అయితే, వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించే రాజ్యాంగం తనకు రక్షణగా ఉంటుందని తాను నమ్ముతున్నానని చెప్పాడు.
వాక్ స్వాతంత్ర్యాన్ని నమ్ముతానని, అయితే అది గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించిందని తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే కోర్టుకు తెలిపారు. అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, గూఢచర్యం ఆరోపణలను అంగీకరించడంతో యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జ్ రమొనా వి. మంగ్లోవా, అసాంజే బ్రిటన్‌లో నిర్బంధంలో ఉన్న కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
అంతకుముందు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి 52 ఏళ్ల అసాంజే ఆస్ట్రేలియాకు బయలుదేరారు. మార్గం మధ్యలో పశ్చిమ పసిఫిక్ లోని యూఎస్ భూభాగం సైపాన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట భార్య స్టెల్లా అసాంజే ఉన్నారు. ఆస్ట్రేలియాలో జన్మించిన ప్రస్తుతం సొంత దేశానికి వెళ్తున్నారు. గూఢచర్యం ఆరోపణలతో 5 ఏళ్లు జైలులో గడిపారు. అంతకుముందు ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు.
ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లలో జరిగిన సంఘర్షణల్లో అమెరికా తప్పుల్ని అసాంజే బహిర్గతం చేయడం సంచలనం రేపింది. రహస్య పత్రాలను బయటపెట్టడంతో అతడి జీవితం ప్రమాదంలో పడింది. అతని విడుదల కోసం ఆస్ట్రేలియ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కేసులో అసాంజే విడుదలను ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరింత వ్యాఖ్యలు చేయలేదనని చెప్పారు.
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!