Israeli–Palestinian Conflict: ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న సంగతి అందరికి సుపరిచితమే. ఈ మారణహోమంలో అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా.. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతిస్పందన దాడిలో దాదాపుగా 3,500 మంది మరణించారు. ప్రస్తుతం గాజా పరిస్థితి దయానియ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఈజిప్టు మానవతా సహాయానికి ముందుకు వచ్చింది. అయితే జరుగుతున్న ఈ యుద్ధఖాండ పైన స్పందించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్, హమాస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివరాలలోకి వెళ్తే.. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయం నుండి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలస్తీనా గ్రూప్ హమాస్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లపై విమర్శల జల్లు కురిపించారు. ఇరుగు పొరుగు రాజ్యాలు రెండూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also:Supreme Court: ఫైబర్ నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
ఒక గొప్ప దేశంగా ఉన్న మేము బాధ్యతారాహిత్యంగా చిన్నపాటి ఆవేశపూరిత రాజకీయాలను చేయలేము. అలాంటి వాటిని అసలు అనుమతించము. హమాస్ వంటి ఉగ్రవాదులను, వాళ్ళకి సహకరించే పుతిన్ వంటి నియంతలను ఎప్పటికి గెలవనివ్వము. కాగా ఉక్రెయిన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ నుండి భారీ నిధులను అభ్యర్థిస్తానని అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. అయితే గ్లోబల్ లీడర్‌గా అమెరికా భవిష్యత్తుకు ఇది పెట్టుబడిగా మారుతుందనేది దీని వెనుక వాదన. ఇది తరతరాలుగా అమెరికా భద్రతకు డివిడెండ్ చెల్లించే స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు.