World War 3: మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా బైడెన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ప్రస్తుతం పెను దుమారం రేపుతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన కలిగిస్తుంది. బైడెన్ నిర్ణయంపై రష్యా తీవ్రంగా మండిపడింది. తమ భూభాగంపై అమెరికా క్షిపణులు పడితే వారికి తగిన విధంగా సమాధానం ఇస్తామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హెచ్చరించాడు.
Read Also: Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?
ఇక, రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లుగానే తాము భావిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పేర్కొన్నారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని సెప్టెంబర్ 12నవ తేదీన ఆయన వార్నింగ్ ఇచ్చారు. రష్యా తన అణు విధానానికి ఇప్పటికే సవరణలు చేసేసింది. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడికి దిగితే.. అణ్వాయుధాలు వాడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Rushikonda buildings: రుషికొండ భవనాలపై కౌన్సిల్‌లో డిష్యుం డిష్యుం..!
కాగా, జో బైడెన్ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకొందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా ఆరోపించింది. ఈ చర్య మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే విధంగా ఉందని అభివర్ణించారు. అయితే, మరో రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగించుకోవచ్చని ఉక్రెయిన్‌కు అనుమతివ్వడం వెనక నార్త్ కొరియా సేనలు మాస్కోకు బాసటగా నిలవడమే కారణమని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు తన నిర్ణయాన్ని జో బైడెన్ సమర్థించుకుంటున్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
అయితే, ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య శాంతిని నెలకొల్పి..అమాయకుల ప్రాణాలను కాపాడాలని మా తండ్రి ( డొనాల్డ్ ట్రంప్) భావిస్తుంటే ఈలోగానే మూడో ప్రపంచ యుద్ధాన్ని జో బైడెన్ యంత్రాంగం కోరుకుంటోందని జూనియర్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. యూఎస్ అధ్యక్షుడి చర్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తుందన్నారు.
https://twitter.com/realDonParody/status/1858361662274781670
