Site icon NTV Telugu

JD Vance: ఉగ్ర వేటలో భారత్‌కు సహకరించండి.. పాక్‌కు జేడీవాన్స్ సూచన

Jdvance

Jdvance

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ‘‘స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ స్పందించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని కోరారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!

జేడీ వాన్స్‌ కుటుంబం భారత్‌లో పర్యటిస్తున్నప్పుడే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని జేడీ వాన్స్ భరోసానిచ్చారు.

ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసివేసింది. యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. భారత్ గగనతలాన్ని మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరికి గురైంది. ఇదిలా ఉంటే ఉగ్రవాదలు కోసం ఎన్‌ఐఏ వేట సాగిస్తోంది.

ఇది కూడా చదవండి: Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు

Exit mobile version