JD Vance-Netanyahu: జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ.. ఏం జరిగిందంటే..!
- జేడీ వాన్స్-నెతన్యాహు మధ్య తీవ్ర ఘర్షణ
- ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్‌పై దాడులు చేయాలన్న అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ చాలా హాట్ హాట్‌గా సాగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌పై యుద్ధం విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్లుగా ఆక్సియోస్ తన నివేదికలో పేర్కొంది.
సోమవారం నెతన్యాహు-జేడీ వాన్స్‌ల మధ్య జరిగిన తీవ్ర సంభాషణ తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు జేడీ వాన్స్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-అమెరికన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం గురించి నెతన్యాహు చేసిన అనేక అంచనాలు.. ముఖ్యంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు తిరుగుబాటు చేసే విషయంలో మితిమీరిన ఆశావాదంతో కూడుకున్నవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముందు పాలన మార్పు జరిగే అవకాశం వాస్తవం కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పి నెతన్యాహు.. అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రలోభపెట్టారని.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి నెతన్యాహును జేడీ వాన్స్ ప్రశ్నిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!
ఇదిలా ఉండగా ఇరాన్ గడ్డపై అమెరికా దళాలు భూతల దాడులకు దిగడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలోని తమ స్థావరాల్లో సొంత సైనికులను కాపాడలేక.. వారిని హోటళ్లు, పార్కుల్లో దాచిపెడుతున్న అమెరికా.. ఇరాన్ గడ్డపై వారిని ఎలా కాపాడగలదు?.’’ అని ప్రశ్నించారు.
రష్యా హెచ్చరిక
ఇరాన్‌లో అమెరికా జరిపే భూతల సైనిక చర్య వియత్నాం యుద్ధం వంటి పరిణామాలనే కలిగిస్తుందని.. దాని నుంచి అమెరికా గౌరవప్రదంగా బయటపడలేదని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరించారు. అటువంటి పరిణామాలు ఈ ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఇరాన్ కూడా అమెరికాకు వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేసిందని.. వియత్నాం యుద్ధంలో అమెరికా ఘోర పరాజయాన్ని చవిచూసిందని.. అమెరికా ప్రజలు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరని గమనించాలని రష్యా సూచించింది.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?