Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Japanese Train Runs On Fuel Generated From Ramen Soup

Train Drove With Noodles Soup: జపాన్‌లో కొత్త ప్రయోగం.. నూడుల్స్ సూప్‌తో రైలు ప్రయాణం

Published Date :September 13, 2022 , 8:27 am
By NTV WebDesk
Train Drove With Noodles Soup: జపాన్‌లో కొత్త ప్రయోగం.. నూడుల్స్ సూప్‌తో రైలు ప్రయాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Japanese Train Runs on Fuel Generated From Ramen Soup: ఈ ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి.. మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఊహకందని ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా జపాన్ వాళ్లు ఓ కొత్త ప్రయోగంతో ఆశ్చర్యచకితుల్ని చేశారు. నూడుల్స్ సూప్‌తో తయారు చేసిన పదార్థంతో.. రైలుని విజయవంతంగా నడిపారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ.. ఈ విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జపాన్ వారు ఎక్కువగా తినే రెండు రకాల వంటకాల వ్యర్థాలతో ఈ ప్రమోగం చేసింది.

జపాన్ వాసులు టొంకుట్సు రామెన్‌ సూప్‌ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్‌ ఫ్రై) వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం రెస్టారెంట్లలోనే కాదు.. ఇళ్లల్లోనూ వీటిని పెద్దఎత్తున తయారు చేసుకుంటారు. అయితే.. అంతే స్థాయిలో ఈ వంటకాలు వృధా అవుతుంటాయి కూడా! దీన్ని అరికట్టడం కోసమే.. ఏదైనా ఒక పరిష్కారాన్ని వెతకాల్సిందేనని ఆలోచించారు. ఎట్టకేలకు వాళ్లకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. వృధా అవుతున్న ఆ ఆహార పదార్థాల నుంచి బయో డీల్ తయారు చేయాలని నిర్ణయించారు. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యర్థాల నుంచి బయో డీజిల్ నుంచి తయారు చేసే బాధ్యతను నిషిడా షౌన్‌ అనే రవాణా కంపెనీకి అప్పగించారు.

ఆ నిషిడా షౌన్ సంస్థ కొన్ని రెస్టారెంట్ల నుంచి రామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాలను సేకరించింది. వాటిని రసాయనాలతో శుద్ధి చేసి, బయో డీజిల్‌ను తయారు చేసింది. మొదట ఈ బయో డీజిల్‌తో కొన్ని రైలింజన్లను నడపగా.. ఆ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో.. ఇటీవల మియాజాకీ నగరంలో ఓ సైట్-సీయింగ్ రైలుని ఆ వృథా బయో డీజిల్‌తో నడిపింది. ఈ రైలు నడుపుతున్నప్పుడు.. దాన్నుంచి వెలువడే పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోని సదరు సంస్థ తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bio Diesel With Ramen Soup
  • Japanese Food
  • Japanese Train
  • Noodles Train Soup
  • Train Runs On Ramen Soup

తాజావార్తలు

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions