Japan Election: నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
- నేడు జపాన్ ప్రధాని పదవికీ ఎన్నికలు..
- ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు..
- ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదు: పరిశీలకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Election: జపాన్ ప్రధాన మంత్రి పదవికి ఈ రోజు (శుక్రవారం) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో దాదాపు 9 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుత మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే, కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ ఇమేజ్ ను వినియోగించుకుని.. 2025 అక్టోబర్ లో జరిగే దిగవసభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Read Also: Indian Navy : సముద్రంలో పెరగనున్న భారత్ బలం.. నౌకాదళంలోకి 7 కొత్త యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామి
Also Read
- Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
- US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
- Pakistan: "పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం".. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
- Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
ఇక, ఎల్‌డీపీకి 368 మంది ఎంపీల బలం ఉండగా.. ఎంపీకి ఒక ఓటు ఉండనుంది. 11 లక్షల ఎల్‌డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీ పడుతున్న అభ్యర్థులకు కేటాయించనున్నారు. అంటే తొలిరౌండ్‌లో మొత్తం 736 ఓట్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్‌లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా నిలవనున్నారు. ఏకంగా తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉండటంతో తొలిరౌండ్‌లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ లేదని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజే రెండో రౌండ్ ఓటింగ్ కూడా జరగే అవకాశం ఉంది. మొదటిరౌండ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెకండ్ రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధించనున్నారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటు వేసేందుకు అర్హులు.
Read Also: Bruxism Teeth: నిద్రలో పళ్లు కొరుక్కోకుంటున్నారా.? ఇలా చేసి ఉపశమనం పొందండి!
కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 415 ఓట్లు ఉండనున్నాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. ఈ రేసులో ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెప్పుకొచ్చాయి. మాజీ రక్షణ మంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నట్లు టాక్. మిగతా పోటీదారులుగా యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో, యోషిమాసా హయా, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి ఉన్నారు.
తాజావార్తలు
-
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
-
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
-
Vishal Garg: ఒక్క వీడియో కాల్‌తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
-
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!