Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..

  • యూనస్-ఇస్లామిస్టుల మధ్య సంబంధాలు నిజమేనా..
  • బంగ్లా అధ్యక్షుడిపై మతోన్మాద పార్టీ అధినేత విమర్శలు..
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో బీఎన్సీ అధినేత తారిఖ్ రెహ్మాన్ గెలిచిన తర్వాత, మహ్మద్ యూనస్ పాలన ముగిసింది. అయితే, యూనస్ పాలనపై ఇటీవల బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహహ్మద్ షాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్‌కు మనోన్మాదులకు సంబంధాలు ఉన్నాయని, మైనారిటీలను టార్గెట్ చేసేలా పాలన కొనసాగిందని ఆరోపించారు. తనను అధ్యక్ష భవనమైన బంగబంధుకే పరిమితం చేశారని, తన ప్రెస్ టీమ్‌ను కూడా తీసేశారని షాబుద్దీన్ యూనస్‌‌ను విమర్శించారు. తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించాలని చూశాడని చెప్పారు.

Read Also: Shoaib Akhtar: “మ్యాచ్‌కు ముందు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకునేవాడిని”.. షోయబ్ అక్తర్ సంచలన స్టేట్‌మెంట్

అయితే, దీనిపై మతోన్మాద పార్టీ అయిన జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహమాన్ స్పందించారు. అధ్యక్షుడు షాబుద్దీన్‌పై విమర్శలు చేశారు. హసీనా దేశం విడిచి వెళ్ళిన రోజు ఆగస్టు 5, 2024న జరిగిన సంఘటనలకు సంబంధించి అనేక వాస్తవాలను షహాబుద్దీన్ ఎలా అణిచివేశారని ప్రశ్నించారు. పారిపోయిన ప్రధాని షేక్ హసీనా రాజీనామా గురించి తెలుసని చెప్పి, ఇప్పుడు మాత్రం నాకు రాజీనామా లేఖ అందలేదని చెప్పడం అబద్ధమని షఫీకుర్ అన్నారు. ఆ రోజు అందరు నాయకులతో జరిగిన సమావేశంలో ఒకలా మాట్లాడి, ఇప్పుడు మరోలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

దీనిని బట్టి జమాత్‌కు యూనస్‌కు బలమైన సంబంధాలు ఉన్నట్లు రుజువు అవుతోంది. బంగ్లాదేశ్‌లో పాలన ప్రారంభించిన తర్వాత యూనస్ జమాతే ఇస్లామీపై ఆంక్షలు ఎత్తివేశారు. ఉగ్రవాదులుగా అనేక దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి విడిచిపెట్టాడు. వీరిపై ఉన్న కేసుల్ని ఎత్తేశాడు. యూనస్ జమాతే గెలుపు కోసం చివరకు చాలా ప్రయత్నించారు. దీని కోసం బంగ్లా క్రికెట్ ను పణంగా పెట్టారు. ఎన్నికల ముందు భారత వ్యతిరేక వైఖరిని మరింత పెంచేలా, ప్రజలు బీఎన్పీ వైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేశాడు. చివరకు బీఎన్పీని బంగ్లా ప్రజలు ఆదరించి గెలిపించారు.