Site icon NTV Telugu

Pakistan: పాక్‌ ఆర్మీ లక్ష్యంగా బాంబు దాడులు.. బలూచిస్థాన్ వెళ్తున్న రైలుపై దాడి

Pakistan

Pakistan

పాకిస్థాన్‌లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బలూచిస్థాన్ వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును పేల్చారు. రైల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. బలూచిస్థాన్ తిరుగుబాటుదాలు, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత వహించారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సుల్తాన్‌కోట్ ప్రాంతం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి ఈ రైలును లక్ష్యంగా చేసుకుని తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. తాజాగా పాక్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా ఈ దాడికి పాల్పడింది. ట్రాక్‌లపై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) వల్ల ఈ పేలుడు సంభవించిందని.. క్వెట్టాకు చెందిన ప్యాసింజర్ రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు

ఈ దాడికి బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బాధ్యత వహించింది. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చే వరకు ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. రెస్క్యూ బృందాలు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Exit mobile version