Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- జార్జియా మెలోనీపై ట్రంప్ సోషల్ మీడియా పోస్టు వివాదాస్పదం.
- "వ్యక్తులు వస్తారు.. వెళ్తారు, సంబంధాలు కొనసాగుతాయి" అని ఇటలీ రిఫ్లై.
- G7 సదస్సు తర్వాత కూడా ట్రంప్ మెలోనీ మధ్య వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ మెలోనీని ఉద్దేశించి చేసిన పోస్టుకు ఇటలీ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని ఇటలీ రక్షణ మంత్రి గ్వీడో క్రొసెట్టో అన్నారు. నాటో సదస్సుకు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో.. మెలోనీ తనవైపు అభిమానంతో చూస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు. తనను వెంబడించొద్దు అనే అర్థం వచ్చేలా మెలోనీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో అమెరికా-ఇటలీ మధ్య సంబంధాలు దెబ్బతినవని అన్నారు. ఇరు దేశాలు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. అయితే, ట్రంప్ పోస్టుపై మెలోనీ నేరుగా స్పందించలేదు.
Also Read
గత నెలలో జరిగిన జీ7 సదస్సు తర్వాత నుంచి వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. తన పాపులారిటీని కాపాడుకునేందుకు, మెలోనీ నాతో ఫోటో దిగేందుకు ఆరాటపడిందని ట్రంప్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఫోటో కోసం మెలోనీ తనను వేడుకుందని ట్రంప్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మెలోనీ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అర్ధరహితం అని, మీతో స్నేహం చేయడం వల్ల నాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగదని, ముందు మీరు మీ పాపులారిటీపై దృష్టి పెట్టండి అంటూ ఘాటుగా స్పందించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!