NTV Telugu Site icon

Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..

Israel Iran

Israel Iran

Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఈ రోజు వైమానిక దాడులు చేసింది. నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అక్టోబర్ 01న ఇరాన్, ఇజ్రాయిల్‌పై 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. అయితే, ఈ దాడిని సిరియా, సౌదీ అరేబియా ఖండించాయి.

ఇదిలా ఉంటే, నేడు ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడి, 1981లో ఇజ్రాయిల్, ఇరాక్‌పై జరిపిన దాడిని పోలి ఉంది. జూన్ 1981లో ఇరాక్‌పై జరిపిన దాడిని ‘‘ఆపరేషణ్ ఒపేరా’’గా పిలుస్తారు. ఇజ్రాయిల్‌కి ఇరాన్, ఇరాక్ రెండు దేశాలు కూడా సరిహద్దుల్లో లేవు. చాలా దూరం ప్రయాణించి దాడులు చేయాల్సి ఉంటుంది. 1981లో ఆపరేషన్ ఒపేరా సమయంలో 1100 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను శత్రుదేశాలను దాటుకుని, పరిమిత ఇంధనంతో దాడులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ వేల కిలోమీటర్ల దూరంలోని ఇరాన్ లక్ష్యాలపై దాడులు నిర్వహించింది.

Read Also: IND vs NZ 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ పాయే

ఈ రోజు ఇరాక్‌పై జరిగిన దాడిలో పరిమిత లక్ష్యాలైన ఆపరేషన్ రాడర్, వైమానికి రక్షణ వ్యవస్థలపై దాడులు చేయడంతో ప్రారంభమైనట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది. ఆపరేషన్ ఒపేరాలో జూన్ 7, 1981 సాయంత్రం 4 గంటలకు ఇజ్రాయిల్‌లోని ఎట్జియోన్ విమానాశ్రయం నుంచి 14 యుద్ధవిమానాలు దాడికి బయలుదేరాయి. దాదాపు సాయంత్రం 5.30 గంటలకు ఫైటర్ జెట్లు ఇరాక్‌లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ని ధ్వంసం చేశాయి. ఇజ్రాయిల్ తమ విమానాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్‌ని విజయంతం చేసింది.

1981లో ఇరాక్‌పై దాడిలో ఇజ్రాయిల్ తన F-16Aలను ఉపయోగించింది. F-15Aలు ఎస్కార్ట్‌ అందించాయి. ఈ జెట్లలో భారీ మొత్తంలో ఇంధనాన్ని నింపారు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ, ఆపరేషన్ పూర్తి చేశాయి. తాజాగా ఇరాన్‌పై జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌కి చెందిన 100కి పైగా స్టెల్త్ ఫైటర్ జెట్ F-35లతో దాడులు చేసింది.