Site icon NTV Telugu

Israel-Gaza: గాజాపై కొనసాగుతున్న మారణహోమం.. 60 మంది మృతి

Israelgaza

Israelgaza

గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఐడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం గాజాలో ఎమర్జెన్సీ ఆస్పత్రులు లేకపోవడంతో క్షతగాత్రులకు వైద్యం అందించడం కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి: Jyoti Malhotra Case: యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ కు జ్యోతి మల్హోత్రా కేసు

హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందం ముగియడంతో ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీంతో ఐడీఎఫ్ మరింత తీవ్రంగా దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన దాడుల కారణంగా వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించనందునే ఈ దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత గాజా మొత్తా్న్ని స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు వెల్లడించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నారు.

ఇది కూడా చదవండి: Viral : కళ్లలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయాలంటే..? ఈ వీడియో తప్పనిసరిగా చూడండి..!

2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని హమాస్‌ను ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది.

Exit mobile version