Israel-Iran: ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం.. ఇజ్రాయెల్‌పై 70 క్షిపణులు ప్రయోగం

  • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు
  • జ్రాయెల్‌పై 70 క్షిపణులు ప్రయోగం టెల్ అవీవ్‌లో మోగిన సైరన్లు
Iranattack

Iranattack

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం తొలుత ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో సహా అనేక ప్రాంతాల్లో బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దాదాపు 70 మిస్సైల్స్ ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకుంటోంది. ఓడరేవు నగరమైన బుషెహర్‌పై ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దేశమంతటా ఇజ్రాయెల్ సైరన్లు మోగిస్తోంది. టెల్ అవీవ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు (బాంబు షెల్టర్లు) సమీపంలో ఉండాలని పేర్కొంది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కార్యాలయం సమీపంలో క్షిపణుల దాడి జరిగింది. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో దాడులు జరిగాయి. అయితే దాడులకు ముందే ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనేక మంది సైనికులు మరణించినట్లుగా సమాచారం.